కరోనా ఎలా వచ్చిందో… అలాగే పోతుంది

ట్రంప్  వితండం

Donald Trump

కరోనా వైరస్ విషయంలో ట్రంప్ వ్యవహారం ఊరంతా ఒకదారి అన్న సామెతను గుర్తుకు తెస్తున్నది. కరోనా ఎలా వచ్చిందో అలాగే పోతుందంటూ వితండంగా మాట్లాడుతున్న ట్రంప్ దేశీయ ప్రయోణాలను అనుమతించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తితో అగ్రరాజ్యం వణికిపోతున్నా, పరిస్థితి తీవ్రత హెచ్చుగా ఉన్నా వచ్చే వారం నుంచీ దేశీయ ప్రయాణాలకు అనుమతించేందుకే ట్రంప్ నిర్ణయించారు. 

వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నట్టు వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

కరోనా కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  అలాగే, వచ్చేవారం తొలిసారిగా వాషింగ్టన్ వదిలి అరిజోనా పర్యటనకు ట్రంప్ వెళ్లనున్నారు.

దేశంలో ఆర్థిక కార్యకలాపాలు బలోపేతం చేయడానికే ఈ పర్యటన అని ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టనున్నట్టు చెప్పారు.

ఇందులో భాగంగా 25 వేల మందితో భారీ సభలు నిర్వహిస్తానని వివరించారు.

తాజా ‘నాడి వ్యాసాల కోసం :https://www.vaartha.com/specials/health1/