క్లిష్ట పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ జట్టు

england team
england team


లండన్‌: ప్రపంచకప్‌లో మొదటినుంచి సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు ఇప్పుడు కష్టాల్లో పడింది. ఆ జట్టు ఆడిన మ్యాచ్‌లు 7, గెలిచింది 4, ఓడింది 3. పాయింట్లు 8. ఇది ఇంగ్లండ్‌ ప్రస్తుత పరిస్థితి. వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు భీకరమైన ఫామ్‌లో ఆ జట్టు ఉండగా, ఇప్పుడే ఆ పరిస్థితి లేదు. ఇంగ్లండ్‌ ఇప్పుడు సెమీస్‌కు వెళ్లాలంటే తన ముందున్న రెండు మ్యాచ్‌లలోనూ కచ్చితంగా గెలవాల్సిందే. ఈ రెండు జట్లూ చిన్నా చితకవేమీ కాదు అవి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ని కూడా చేజార్చుకోని ఇండియా, సెమీస్‌ స్థానాన్ని దాదాపు ఖరారు చేసుకున్న న్యూజిలాండ్‌లు.
ఆదివారం నాడు ఇండియాతో, జూలై 3న న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌ ఆడాల్సిఉంది. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్‌లూ గెలవడం ఇంగ్లండ్‌కు చాలా కష్టం అని తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆటగాళ్లు ప్రశాంతంగా ఉండాలని ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ సూచించాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/