అమెరికాలో అమరావతిపై ఆందోళనలు

అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో నిరసనలు

houston-protest
houston-protest

అమెరికా: రాజధాని రైతులకు మద్దత్తుగా అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో తెలుగు ప్రవాసాంధ్రులు రాజధాని ప్రాంత రైతుల ఆందోళనకు అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర ప్రవాసాంధ్రులు సంఘీభావం ప్రకటించారు. హ్యూస్టన్ నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లోని 13 జల్లాలకు చెందిన తెలుగు రైతు బిడ్డలు పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ పోరాటం చేస్తున్నవారికి మద్దత్తుగా నిలవాలని నిర్ణయించినారు, ఆర్ధికంగానూ అండగా ఉండాలని తీర్మానించారు. ప్రవాసాంధ్రులతో ఐకాస ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సమావేశంలో పలువురు ప్రవాసాంధ్రులు రాజధాని రైతులకు మద్దత్తుగా ప్రసంగించారు. మీ రాజధాని ఏదని అడిగితే ఒకే పేరు చెబుతారు. కానీ ఏపీలో 3 పేర్లు చెప్పించే పరిస్తతి తీసుకొస్తున్నారని విమర్శిస్తు బాధపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/