విపక్షాలపై అసహనం వ్యక్తం చేసిన వెంకయ్య

నినాదాలు చేయొద్దు ఇది పార్లమెంటు..బజారుకాదు

venkaiah naidu
venkaiah naidu

న్యూఢిల్లీ: విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో అల్లర్లపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు..సభలో ఆందోళనకు దిగాయి. చైర్మన్‌ ఎంత చెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ సభను ఆటంకపరిచాయి. దీంతో వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలపై ఎలాంటి నోటీసు ఇవ్వకుండా..చర్చలో పాల్గొనకుండా నినాదాలు చేయడం సరికాదని సభ్యుల తీరును తప్పుబట్టారు. సభ ముందుకు సాగకుండా దేశప్రజలకు, దేశానికి మంచిది కాదని ప్రతిపక్షాలకు సచించారు. నినాదాలు చేయొద్దు. ఇది పార్లమెంట్‌..బజారు కాదు అంటూ ఘాటూగా హెచ్చరించారు. అయినా సభ్యులు ఎంతకు శాంతించకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/