‘మహా’ విషాదం- ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం-10 మంది శిశువులు మృతి

వారంతా నెలల శిశువులే…

Hospital fire - 10 babies die
Hospital fire – 10 babies die

Mumbai: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి పది మంది నవజాత శిశువులు మరణించారు. ఈ దుర్ఘటన భండారా జిల్లాలో సంభవించించి.

నాలుగంతస్తుల ప్రభుత్వా ఆసుపత్రి భవనంలో ఈ తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్న పది మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.

ఘటన జరిగినప్పుడు అక్కడ 17 మంది శిశువులు ఉన్నారు. వారిలో ఏడుగురిని రక్షించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా నెలల శిశువులే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/