ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి గౌరవ డాక్టరేట్‌

Vice-President Venkayyanayudu
Vice-President Venkayyanayudu

హైదరాబాద్‌: భారతదేశ సుస్థిర అభివృద్ధి, ప్రజాస్వామ్యం, చట్టాలకు అందించిన సేవలకుగాను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడిని గౌరవ డాక్టరేట్‌ వరించింది. ఐరాస ఆధ్వర్యంలో ఏర్పాటైన యూనివర్శిటీ ఆఫ్‌ పీస్‌ ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. కోస్టారికా రాజధాని సాన్‌జోస్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో యూనివర్శిటీ డీన్‌ నుంచి ఆయన ఖడాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీగ అందుకున్నారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్న తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఈ గౌరవం వ్యక్తిగతంగా తనకు వచ్చింది కాదని, భారత్‌కు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శాంతికోసం అనాదిగా అలుపెరుగని పోరాటం చేస్తూ ఒక దేశానికి, నాగరికతకు, సంస్కృతికి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. శాంతి ప్రబోధకుడైన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ గౌరవాన్ని అందుకోవడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను అని ఆనందం వ్యక్తం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం
క్లిక్‌చేయండ:https://www.vaartha.com/news/nationa/