నేను జోక్యం చేసుకోకపోతే హాంకాంగ్‌ నాశనమయ్యేది

trump
trump

వాషింగ్టన్‌: తానే గనుక జోక్యం చేసుకోకపోతే హాంకాంగ్‌ 14 నిమిషాల్లో నాశనమయ్యేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇంటర్వూ ఇచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నేరస్థులకు చైనాకు అప్పగించే బిల్లుపై హాంకాంగ్‌ వాసులు గత ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ మాట్లాడుతూ హాంకాంగ్‌ బయట లక్షల మంది చైనా సైనికులు ఉన్నారు. నేను చెప్పడం వల్లనే వారు ముందుకు వెళ్లడం లేదు. సైన్యాన్ని ప్రయోగించవద్దు. మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. వ్యాపార ఒప్పందంపై ఇది ప్రభావం చూపుతుందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో చెప్పాను అని వ్యాఖ్యానించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/