హాంకాంగ్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు పీవీ సింధు

P. V. Sindhu
P. V. Sindhu

హాంకాంగ్‌: హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ సీరిస్‌ 500 టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌, రియో ఓలంపిక్‌ విజేత పీవీ సింధు శుభారంభం చేసింది. హాంకాంగ్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది. ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో థాయిలాండ్‌కు చెందిన నిచ్చాన్‌ జిండాల్‌పై పోరాడి విజయం సాధించింది. ప్రస్తుతం వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న పీవీ సింధు నిచ్చాన్‌ జిండాల్‌పై 21-15, 13-21, 21-17 తేడాతో విజయం సాధించింది. సింధు చేతిలో నిచ్చాన్‌ జిండాల్‌కు ఇది నాలుగో ఓటమి కావడం విశేషం. తాజా విజయంతో పివీ సింధు రెండో రౌండ్‌లోకి అర్హత సాధించింది. టోర్నీలో భాగంగా పీవీ సింధు రెండో రౌండ్‌లో కొరియాకు చెందన సుంగ్‌ జీ హుయన్‌తో తలపడనుంది. రెండో రౌండ్‌లో పీవీ సింధు విజయం గనుకు సాధిస్తే క్వార్టర్స్‌లో చైనాకు చెందిన హిబింజియోతో తలపడాల్సి ఉంటుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/