ఒడిశాకు హాంగ్‌కాంగ్‌ ఆర్థిక సహాయం

cyclone Fani Odisha
cyclone Fani Odisha

బీజింగ్‌: ఒడిశాలో తుషాన్‌ ధాటికి 64 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే తుఫాన్‌ తాకిడితో అతలాకుతలమైన ఒడిశాలో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థిక సహాయం అందజేయాలని హాంగ్‌కాంగ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 7,032 మిలియన్‌ హాంగ్‌ కాంగ్‌ డాలర్లను (9 లక్షల 02 వేల 278 అమెరికన్‌ డాలర్లు) ఆర్థిక సహాయం అందించడానికి హాంగ్‌కాంగ్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చైనా అధికార మీడియా వార్త ప్రచురించింది. ఓడిశా తుఫాన్‌ ధాటికి 5 లక్షలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. తుపాన్‌ తీరని నష్టాన్ని మిగిల్చింది.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/