హనీట్రాప్‌ నిందితుల అరెస్ట్‌!

honey trap
honey trapబెంగళూరు: ఈ మధ్య దేశంలో హైటెక్‌ హనీట్రాప్‌ ఎక్కువయింది. ఈ మధ్యే ఒక రాష్ట్రంలో ఈ ముఠాను పోలీసులు వలవేసి పట్టుకున్నారు. అది మరువక ముందే కర్ణాటకలో మరో ముఠా పోలీసులకు చిక్కింది. దుబా§్‌ు నుండి వచ్చిన వ్యక్తికి కాలేజీ అమ్మాయిని ఎరగా వేసి రూ.50 లక్షలు లూటీ చేయడానికి ప్రయత్నించి ముఠాను మడికేరి పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే రహస్యంగా తీసిన వీడియోను టివిలో చూపిస్తామని బెదిరించి నిందితులు బ్లాక్‌మెయిల్‌ చేశారు. హనీట్రాప్‌ నిందితుల్లో ముఖ్యుడు కరీంలాల్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అహ్మమ్మద్‌ అజారుద్దీన్‌ (24). కతార్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న అబూబకర్‌ సిద్ధికీ (33), హైసనార్‌ (27), ఇర్షాద్‌ ఆలీ (27), ఎఎ.సమీర్‌ (26) అనే నిందితులతో పాటు ఒక అమ్మాయిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.కాలేజిలో చదువుతున్న ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్న నిందితులు ఆమెకు మాయమాటలు చెప్పి హనీట్యాప్‌ ఉచ్చులోకి దింపారు. యువతిని అడ్డం పెట్టుకుని అక్రమ మార్గంలో నగదు సంపాదించాలని ప్లాన్‌ వేశారు. ఎమ్మమాడు ప్రాంతానికి చెందిన గఫూర్‌ అనే వ్యక్తి వద్ద భారీ మొత్తంలో డబ్బు ఉన్న విషయం తెలిసి అతనికి అమ్మాయికి ఎరగా వేసారు. వారిద్దరు కలిసి ఉన్న దృశ్యాలనువీడియో తీసి నిందితులు రూ.50 లక్షలు ఇవ్వకపోతే వీడియో క్లిప్పింగ్‌లను బయటపెడతామని గఫూర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేశారు. అతని వద్ద ఉన్న రూ.60 వేలు, రూ.55వేల విదేశీ కరెన్సి లాక్కున్నారు. ఆ తరువాత గఫూర్‌ను బెదిరించి రూ.380 లక్షలు కూడా తీసుకున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/