జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్‌

YouTube video
Hon’ble Governor Unfurls National Flag & Participates in Republic Day Celebrations at IGMS VJA LIVE

విజయవాడ: ఏపీ విజయవాడలోని ఇందిరా ప్రియదర్విని స్టేడియంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ , శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో విజటర్స్‌కు అనుమతి నిరాకరించారు.

అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. ‘విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. మనబడి నాడు-నేడు కింద కొత్తగా స్కూళ్లు, కాలేజీలు అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో విద్యను తీసుకొచ్చారు. పేద విద్యార్థులకు బాసటగా జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు. జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన,గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది అన్నారు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/