వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌

Hon’ble Governor & Hon’ble CM will be Participating in YSR Lifetime Achievement Awards at VJA LIVE

అమరావతి: వైస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం జగన్ సోమవారం ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్‌ విజయమ్మ హాజరయ్యారు.ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. కేవలం సేవలను పరిగణనలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేశామన్నారు. సామాన్యులుగా ఉండే అసమాన్యుల ప్రతిభకు పట్టం కట్టామన్నారు. కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేశామన్నారు. రైతులు, రచయితలు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను ఎంపిక చేశామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగుజాతికి శుభాకాంక్షలు. సామాన్యులుగా ఉన్న అసామాన్యుల మధ్య సమయం గడపడం నా అదృష్టం. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని పలు సూచనలు వచ్చాయి. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్‌ ప్రదానోత్సవం నిర్వహిస్తున్నాం. నిండైన పంచెకట్టుతో వైఎస్సార్‌ ప్రజల గుండెల్లో నిలిచారు. వైఎస్సార్‌ ఆకాశమంత ఎత్తు ఎదిగిన మహా మనీషి’’ అని సీఎం కొనియాడారు.

వైఎస్సార్‌ వైద్య వృతి చేసినా.. వ్యవసాయం, విద్యారంగాలకు విశేష కృషి చేశారని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ అన్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవన్నారు. వ్యవసాయం, ఆక్వా, ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్లోనూ ఏపీ క్రియాశీలకంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథుడని ప్రార్థిస్తున్నానని గవర్నర్‌ అన్నారు. వైఎస్సార్‌ అవార్డులు అందుకున్నవారికి ఆయన అభినందనలు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/