గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను ప్రారంభించిన సిఎం జగన్

YouTube video
Hon’ble CM Unveiling of Plaque at ITC Global Spices Processing Facility, Spices Park, Palnadu Dist.

అమరావతిః సిఎం జగన్‌ పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడులో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ యూనిట్ ను ఐటీసీ సంస్థ రూ. 200 కోట్లతో నిర్మించింది. 6.2 ఎకరాల స్థలంలో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే విధంగా ఈ పార్క్ ను అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఈ యూనిట్ ద్వారా 14 వేల మంది రైతులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.

రెండో దశ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు కూడా ఐటీసీ ప్రణళికలను సిద్ధం చేస్తోందని సీఎం తెలిపారు. ఈ యూనిట్ ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. మన రైతులను చేయిపట్టి నడిపించే బాధ్యతను ఐటీసీ తీసుకుందని అన్నారు. ఆర్బీకే విధానం ద్వారా రైతుల జీవితాల్లో మార్పును తీసుకొస్తున్నామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ తొలి స్థానంలో నిలిచిందని వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/