రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత ఆర్థిక సహాయం పంపిణీ

మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ

YouTube video
Hon’ble CM of AP will be Disbursing Financial Assistance Under “YSR CHEYUTHA from Camp Office LIVE

అమరావతి: ఏపీ లో వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా వరుసగా రెండో ఏడాది రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయాన్ని సీఎం జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుదని, మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేశామన్నారు. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 సాయం అందిస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో రూ.75వేల చొప్పున సాయం చేసే గొప్ప కార్యక్రమమని, ప్రతి కుటుంబానికి మహిళలే రథసారధులు సీఎం జగన్‌ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/