వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్

YouTube video
Hon’ble CM of AP will be Disbursing Assistance to Farmers under “YSR Rythu Bharosa – PM Kisan” LIVE

అమరావతి : సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతు పక్షపాత ప్రభుత్వం ఇది. ఒకేసారి మూడు పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేస్తున్నామన్నారు. రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం అమలు చేస్తున్నామని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని అన్నారు.

వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నావడ్డీ, యంత్రసేవా పథకం… ఈ మూడు పథకాలకోసం రూ. 2190 కోట్ల లబ్ధి. వరుసగా మూడో సంవత్సరం.. రెండో విడత కింద రూ.2052 కోట్ల రూపాయలను జమచేస్తున్నాం. ఇప్పటికే రైతు భరోసా రెండో విడతగా ఆగస్టు మాసంలో రూ. 977 కోట్లు ఇచ్చాం. కేవలం ఈ ఒక్క రైతు భరోసా కింద మాత్రమే రూ.18,777కోట్లు ఇవ్వగలిగాం. దేశంలో ఎక్కడా కూడాలేని విధంగా, జరగని విధంగా సొంత భూములను సాగుచేసుకుంటున్న రైతులతోపాటు, కౌలు రైతులకు, అటవీ, దేవాదాయ భూములను సాగుచేసుకుంటున్న రైతులకు ప్రతి ఏటా రూ.13500రూపాయలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 6,67లక్షల రైతులకు రూ.112 కోట్లకుపైగ సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపు చేస్తున్నాం. ఏడాదిలోపే పంటరుణాలు చెల్లించిన వారికి.. వారు కట్టీని వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి జమచేస్తున్నామని సీఎం అన్నారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/