తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సిఎం జగన్‌

YouTube video
Hon’ble CM of AP Participation in Tungabhadra Pushkaram at Sankal Bagh Pushkar Ghat, Kurnoo

కర్నూలు: సిఎం జగన్‌ తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం సంకల్‌భాగ్‌ ఘాట్‌లో సిఎం జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సిఎం జగన్‌ వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, గుమ్మనూరు జయరాం, కలెక్టర్‌ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కంగాటి శ్రీదేవి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్‌ ఉన్నారు. నేటి నుంచి డిసెంబర్‌ 1వరకు.. 12 రోజులపాటు తుంగభద్ర పుష్కరాలను నిర్వహించనున్నారు. ఐదువేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/