ఇలా చేస్తే సరి

‘చెలి’ ఇంటింటి చిట్కాలు

Washing-
Washing-
  • పసిపిల్లలకు అజీర్తి వ్యాధి కలగకుండా వారానికి మూడునాలుగు సార్లు ఓ స్పూన్‌ తేనెను తాగించాలి.
  • ఐస్‌లో పెట్టిన రొయ్యలు తాజాగా ఉండాలంటే వాటిని వెనిగర్‌ డ్రైవైన్‌ల మిశ్రమంలో ఉంచాలి.
  • మైనం కరిగించి మెత్తగా ఉన్నప్పుడే, అరికాళ్ల పగుళ్లకు పట్టిస్తే అది త్వరగా తగ్గుతుంది.
  • పసిపిల్లలకు జలుబు, దగ్గు తరచుగా రాకుండా ఉండాలంటే జాజికాయ అప్పుడప్పుడు అరగదీసి పిల్లలచేత కొద్ది కొద్దిగా నాకిస్తూ ఉండాలి.
  • ఖాళీ షాంపు ప్యాకెట్సు సబ్బు నీళ్లల్లో వేసి బట్టలు నానవేస్తే బట్టలు మంచి వాసన వేస్తూంటాయి.
  • పట్టు చీరలకు ఫాల్స్‌ కుట్టితే అంచులు నలిగి పోయి ముడతలు పడకుండా ఉంటాయి.
  • బట్టలు ఇస్త్రీ చేసేటప్పుడు చల్లని నీటిని బట్టలపై చిలకరించడం అందరూ చేసేపని చల్లనినీటికి బదులుగా గోరువెచ్చని నీటిని వాడితే మీ ఇస్త్రీ కార్యక్రమం త్వరగా అయిపోతుంది.
  • జార్జెట్‌, షిఫాన్‌ చీరెలు ఉతికితే ముడుచుకుపోతాయి. అలాంటివాటిని తడిపి ఉతికిన వెంటనే రోకలికి చుట్టి ఒక్కొక్క పొరతీసి ఆరవేస్తే ఇస్త్రీకూడా అవసరం ఉండదు.
  • పట్టుబట్టకి తుమ్మజిగురు గంజి మాదిరిగాపెడితే అవి మరికొంత కొత్తదనంగా బిరుసుగా ఉంటాయి.
  • నూలు బట్టలకి బ్లూ పెట్టేటప్పుడు ఒక్కోచోట ఎక్కువగా అంటడం మరకలుగా ఏర్పడటం జరుగుతుంది. ఇవి పోవాలంటే పావు బక్కెట్టు నీళ్లల్లో 5 లేక 6 చుక్కలు వెనిగరు వేసి, బట్టలు దానిలో ముంచి ఆరవేస్తే ఆ మరకలు ఇకకన్పించవు.
  • బీరువాలో బట్టలు చక్కటి వాసన రావాలంటే కర్పూరం బిళ్లల్ని మూలల్లో ఉంచండి మంచి వాసన వస్తుంది.
  • బట్టలు మీద ఏదైనా మరకలు అయితే ఉప్పునీటితో ముందు రుద్ది, ఆ తర్వాత సబ్బుతో రుద్దాలి. ఉతికినప్పుడు ఉన్ని బట్టలు సాగిపోకుండా ఆఖరుసారి జాడించే నీటిలో చెమ్చాడు గ్లిజరిన్‌ కలపండి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/