కరోనాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హోం క్వారంటైన్ గడువు 14 నుండి 28 రోజులకు పెంపు

corona virus
corona virus

హైదరాబాద్‌: కరోనా నేపథ్యలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. హోం క్వారంటైన్‌ను 28రోజులకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌లకే పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సెకండరీ కాంటాక్ట్‌కు 28రోజుల క్వారంటైన్‌ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు కనిపించడానికి 1 నుంచి 14 రోజులు పడుతోందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ అంటారు. కానీ.. కొన్ని కేసుల్లో ఆ లెక్క తప్పుతోంది. కానీ కొందరిలో ఇన్ఫెక్షన్‌ లక్షణాలు 14 నుంచి 28 రోజుల మధ్య బయటపడుతున్నాయి. దీనివల్ల లక్షణాలు కనబడకున్నా కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/