త్వరలో అగ్నిమాపకశాఖలో ఉద్యోగాల భర్తీ

Sucharitha Home Minister Of AP
Sucharitha Home Minister Of AP

విజయవాడ: ఏపి హోమంత్రి మేకతోటి సుచరిత ఈరోజు విజయవాడలో జిల్లా అగ్నిమాపక కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతు అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని.. త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 155 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది చేరుకోవాలంటే చాలా సమయం పడుతోందని.. అలాంటి చోట నూతన ఫైర్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో అగ్నిప్రమాదాలు తగ్గినా.. పారిశ్రామిక వాడల్లో మాత్రం పెరుగుతున్నాయని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/