కరోనా నుంచి కోలుకుని తిరిగి విధుల్లోకి హోంమంత్రి
ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని వ్యాఖ్య

హైదరాబాద్ : తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కరోనా నుండి కోలుకున్న తర్వాత సోమవారం తన విధులను తిరిగి ప్రారంభించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఆయన డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అలాగే, కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా చూడాలని, వారిలో విశ్వాసం పెంపొందించాలని ఆయన పోలీసులకు సూచించారు. కరోనాకు వ్యాక్సిన్ రాలేదని, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని, ప్రజలందరూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. అందరూ పోషకాహారం తీసుకోవాలని చెప్పారు. తనకు ఆస్తమా కూడా ఉందని, ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిందని చెప్పారు. అయినప్పటికీ తాను పోషకాహారంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో కరోనా నుంచి బయట పడినట్లు చెప్పారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/international-news/