హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ కరోనాతో మృతి

అభిమానులు , సన్నిహితులు  తీవ్రసంతాపం

Hollywood star Mark Blum (File Pic)
Hollywood star Mark Blum (File Pic)

అమెరికాలో ఉండే పలువురు హాలీవుడ్ స్టార్స్ కు కరోనా వైరస్ సోకినట్లుగా సమాచారం. కొందరు కరోనా నుండి బయట పడుతూ ఉంటే , మరికొందరు ఇంకా కరోనా వైరస్ తో పోరాడుతున్నారు.

తాజాగా హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 69 ఏళ్ల మార్క్ హాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో  నటించడంతో  పాటు  ఈమద్య కాలంలో  వెబ్ సిరీస్ ల్లో  కూడా కనిపించాడు.

మార్క్ రెండు వారాలుగా కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ వయసు మీద పడటంతో
తుది శ్వాస విడిచారు.

మార్క్ బ్లమ్ మృతి చెందిన విషయాన్ని ఆయన భార్య జానెట్ జరీస్ నిర్థారించారు. మార్క్ బ్లమ్ మృతితో ఆయన అభిమానులు , సన్నిహితులు  తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయనతో పనిచేసిన ఎంతో మంది సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com