ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు రేపు సెలవు ప్రకటించిన ప్ర‌భుత్వం

హైదరాబాద్ : రాష్ట్ర ప్ర‌భుత్వ మ‌హిళా ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం సెల‌వు ప్ర‌క‌టించింది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌తి ఏడాది మ‌హిళా ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం సెలవు ఇస్తోంది. ఈ మేర‌కు రేపు సెల‌వు ప్ర‌క‌టిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళా సంబురాలు కొన‌సాగుతున్నాయి. వివిధ రంగాల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన మ‌హిళ‌ల‌కు స‌న్మాన కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/