హాకీ స్టిక్స్‌తో కొట్టుకున్న ఆటగాళ్లు

Punjab Police, PNB in ugly fight
Punjab Police, PNB in ugly fight

ఢిల్లీ: జాతీయ స్థాయిలో జరిగే నెహ్రూ హాకీ కప్‌ టోర్నమెంట్‌లో అందులోనూ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆటగాళ్లు క్రీడా స్పూర్తిని మరిచిపోవడమే కాకుండా..విజ్ఞత కూడా వదిలేశారు. హాకీ స్టిక్స్‌తో ఒకరిపై ఒకరు కొట్టుకున్నారు. మ్యాచ్‌ను గెలిచి తీరాలన్న కసి కొట్లాటకు దారి తీసింది. వివారాల్లోకి వెళ్తే..56వ నెహ్రూ హీకీ టోర్నమెంట్‌లో భాగంగా పంజాబ్‌ పోలీస్‌ టీమ్‌- పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ టీమ్‌లు తుది పోరులో తలపడ్డాయి. ఈ రెండు జట్లు నువ్వా-నేనా అన్నట్లు ఆడుతున్నాయి. రెండు జట్లు తలో మూడు గోల్ఫ్‌తో సమంగా ఉన్నాయి. ఈ సమయంలో పంజాబ్‌ పోలీస్‌ జట్టు..పంజాబ్‌ నేషనల్‌ జట్టుతో కాస్త దురుసుగా ప్రవర్తించడంతో ఇరు జట్ల ఆటగాళ్లు తొలుత మాటల యుద్ధానికి దిగారు. అది కాస్తా పెద్దదిగా మారి హాకీ స్టిక్స్‌తో ఇరు జట్లు ఆటగాళ్లు కొట్టుకున్నారు. దాంతో మ్యాచ్‌ నిర్వహాకులు కలగజేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఈ గొడవ తర్వాత మళ్లీ మ్యాచ్‌ ఆడిన ఇరు జట్లలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ జట్టు 6-3 తేడాతో పంజాబ్‌ పోలీస్‌ జట్టుపై విజయం సాధించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/