‘హిట్ 2’ రిలీజ్ డేట్ ప్రకటించిన నాని

హిట్ చిత్రానికి సీక్వెల్ గా హిట్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా , శైలేష్ కొల‌ను డైరక్షన్ లో 2020 లో క్రైం ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ రిలీజ్ టైమ్ లోనే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్ 2’ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్ లో కూడా విశ్వక్ సేన్ హీరోగా ఉంటారని అనుకున్నారు కానీ విశ్వక్ బదులుగా అడివి శేష్ ను తీసుకున్నారు.

వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని సమర్పణలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌ లో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. గత కొద్దీ రోజులుగా ఈ సీక్వెల్ తాలూకా అప్డేట్ లేకపోయేసరికి ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలో నాని సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి వారిలో ఉత్సహం నింపారు. డిసెంబర్ 2న మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.