రామమందిరాన్ని బంగారంతో కడతాం

swami chakrapani
swami chakrapani


న్యూఢిల్లీ: రామజన్మభూమిబాబ్రీ మసీదు వివాదంపై వచ్చే నవంబర్‌లో హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడిన వెంటనే అయోధ్యలో రామాలయాన్ని బంగారంతో కడతామని హిందూ మహా సభకు చెందిన స్వామి చక్రపాణి వెల్లడించారు. అయోధ్యలో రామమందిరాన్ని ఇటుకలు, రాళ్లతో కాక బంగారంతో కడతామని సోమవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. భారతదేశంలోని సనాతన ధార్మిక హిందువులే కాక ప్రపంచంలోని హిందువులంతా రాముడికి బంగారు గుడిని కట్టేందుకు విరాళాలిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రామజన్మభూమి వివాదంపై అక్టోబర్ 18లోగా వాదప్రతివాదనలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గత వారం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం నవంబర్ మొదటివారంలో ఈ వివాదంపై తీర్పు వెలువడుతుందని సామి చక్రపాణి ఆశాభావంతో ఉన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/