పాక్‌లో దారుణం…16 ఏళ్ల హిందూ బాలికకు బలవంతంగా వివాహం

మాజీ అధ్యక్షుడి నివాసం ఎదుట హిందూ సభ్యుల ఆందోళన

hindu-girl-abducted-and-forcefully-married-to-muslim-man-in-pakistan

ఇస్లామాబాద్ః పాకిస్తాన్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ హిందూ బాలికను కిడ్నాప్ చేసిన ఓ యువకుడు ఆమెను బలవంతంగా వివాహం చేసుకున్నాడు. సింధ్ ప్రావిన్స్‌లో జరిగిందీ ఘటన. 16 ఏళ్ల బాలికను తొలుత కిడ్నాప్ చేసిన యువకుడు ఆ తర్వాత ఆమెను బలవంతంగా మతం మార్పించాడు. ఆపై వివాహం చేసుకున్నాడు.

విషయం తెలిసిన అక్కడి హిందూ సమాజం దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. నవాజ్‌షాలోని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ నివాసం ఎదుట ఆందోళన తెలిపింది. తమకు మద్దతుగా నిలవాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయనను కోరింది. కాగా, సింధ్ ప్రావిన్స్‌లోని కాజీ అహ్మద్ నగరంలో వారం రోజుల క్రితం ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/