పాక్‌లో హిందూ నవ వధువు అపహరణ

మతం మార్చి ముస్లిం యువకుడితో వివాహం..తీవ్రంగా పరిగణించిన భారత్

Hindu-bride
Hindu-bride

కరాచీ: పాకిస్థ్థాన్‌లోఓ హిందూ వివాహం జరుగుతుండగా, 24 ఏళ్ల వధువును అపహరించిన దుండగులు మతం మార్చి ముస్లిం యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రావిన్స్ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి హరిరామ్ కిశోర్ అధికారుల నుంచి నివేదిక కోరారు. మరోవైపు, భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టిసారించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు చెందిన సీనియర్ ఉద్యోగిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. కాగా, అపహరణకు గురైన యువతి గతేడాది డిసెంబరులో బనోరీ పట్టణంలో ఇస్లాం మతం స్వీకరించిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సింధ్ ప్రావిన్స్‌లోని హలా పట్టణంలో గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/