స్వీయ నిర్బంధంలో బండారు ద‌త్తాత్రేయ

Bandaru Dattatreya
Bandaru Dattatreya

న్యూఢిల్లీ: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రాజ్‌భ‌వ‌న్‌లో ఏడీసీ అధికారికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేల‌డంతో ద‌త్తాత్రేయ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు. ఆయ‌న అన్ని అపాయింట్‌మెంట్ల‌ను ర‌ద్దు చేసుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శి రాకేశ్ క‌న్వ‌ర్‌తో పాటు ఏడీసీ సిబ్బంది మొత్తాన్ని క్వారెంటైన్ చేశారు. ఆరోగ్య‌శాఖ సిబ్బంది వారంద‌రికీ కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ది. ఇటీవ‌ల ఆ రాష్ట్రానికి చెందిన విద్యుత్ శాఖ మంత్రి సుక్రామ్ చౌద‌రీ, జ‌ల‌శ‌క్తి మంత్రి మ‌హేంద‌ర్ సింగ్ థాకూర్‌లు పాజిటివ్‌గా తేలారు. అయితే ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం కోలుకున్నారు. కాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 12,899కి చేరుకున్న‌ది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/