తెలుగు రాష్ట్రాలకు ‘హికా’ తుపాను హెచ్చరికలు

‘Hika’ cyclone warnings

Hyderabad, Amaravati: తెలుగు రాష్ట్రాలకు ‘హికా’ తుపాను  హెచ్చరికలు జారీ చేసింది ఐఎమ్ డి. దక్షిణ భారతదేశంలో రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐ ఎమ్ డి హెచ్చరించింది. ప్రస్తుతం తుపాను అరేబియా సముద్ర తీరంలో కొనసాగుతోందని, క్రమంగా భారత్ తీరం దిశగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. 

అరేబియా తీరంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. మరో  48 గంటల్లో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యూపీ, రాజస్థాన్, విదర్భ, చత్తీస్‌ఘడ్, బెంగాల్‌లో కుంభవృష్టి , అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆలిండియా వార్నింగ్ బులెటిన్‌ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, బెంగాల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/