జపాన్‌ క్రికెట్ జట్టు 41కే ఆలౌట్‌

అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమిండియా హవా

india under-19 team
india under-19 team

బ్లూమ్ ఫోంటీన్ : దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన జపాన్ క్రికెట్ జట్టుకు భారత్ ఘోరపరాజయాన్ని చవిచూపింది. బ్లూమ్ ఫోంటీన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జపాన్ ను టీమిండియా కుర్రాళ్లు హడలెత్తించారు. భారత బౌలర్లు రవి బిష్ణోయి (5 పరుగులిచ్చి 4 వికెట్లు), త్యాగి (3 వికెట్లు) ఆకాశ్ సింగ్ (2 వికెట్లు) ధాటికి జపాన్ బ్యాట్స్ మెన్ కకావికలం అయ్యారు. దాంతో జపాన్ 22.5 ఓవర్లలో కేవలం 41 పరుగులకు ఆలౌటైంది. ఈ అతి స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 4.5 ఓవర్లలో వికెట్ పడకుండా ఛేదించింది. అంతకుముందు, జపాన్ ఇన్నింగ్స్ లో ఐదుగురు బ్యాట్స్ మెన్ సున్నా చుట్టారు. కనీసం బంతి గమనాన్ని కూడా అంచనా వేయలేక జపనీయులు విలవిల్లాడారు. ఈ ఫలితంతో భారత్ రెండు విజయాలతో తన గ్రూప్ లో అగ్రస్థానం అధిష్ఠించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/