అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్తత

ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం

విశాఖ: టీడీపీ పార్టీ సీనియర్ నేత నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆయనను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ను దూషించారంటూ అయ్యన్నపై నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి వద్దకు నిన్న వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. నిన్నటి నుంచి పోలీసులు ఆయన ఇంటి వద్దే ఉన్నారు. దీంతో, ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/