సిఎం జగన్‌ నివాసం వద్ద భారీ బందోబస్తు

Ration Dealers
Ration Dealers

తాడేపల్లి: ఏపి సిఎం జగన్‌ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరిచారు. జగన్‌ నివాసాన్ని రేషన్‌ డీలర్లు ముట్టడిస్తామిన ప్రకటించడంతో సెక్షన్‌ 30ని అమలు చేశారు. అయితే రేషన్‌ డీలర్లుతోపాటు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన చేస్తున్నారు. దీంతో ఎప్పుడు లేని విధంగా సిఎం ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేషన్ సరుకులను వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్దిదారుల ఇంటికే పంపించేందుకు ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అనేక అనుమానాలు రేషన్ డీలర్లకు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డీలర్లు అన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా వారది నుంచి వస్తున్నవారిని పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/