చమురు ధరల్లో వృద్ధి ఆందోళనకరమే?

crude oil
crude oil


న్యూఢిల్లీ: మనదేశ అవసరాల కోసం ఎక్కువభాగం చమురు దిగుమతులు వచ్చేది సౌదీ అరేబియా, ఇరాక్‌, ఇరాన్‌ దేశాల నుంచే. ఇలాంటి ఆయిల్‌ ధరలు పెరుగుదల మనకు శుభవార్తేమీ కాదు. ఇప్పుడు బ్రెంట్‌ క్రూడాయ్‌ి ధర బ్యారెల్‌కు 75డాలర్లుగా ఉంది. ఇది మార్కెట్‌ వర్గాల్లో ఆందోళనను కలిగిస్తోంది. ఆయిల్‌ ధరల ఆందోళన మార్కెట్‌పై పడుతోంది. ఓ వైపు ఆయిల్‌ ధరల పెరుగుదల, మరోవైపుసార్వత్రిక ఎన్నికల ప్రభావం మార్కెట్లపైన పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, డాలర్‌తో మారకంలో రూపాయి విలువ రూ.70కి చేరువలో ఉంది. చమురు ధరలు బ్యారెల్‌కు 72.15డాలర్లకు తగ్గినప్పటికీ ఈ ఏడాదిలో ఇది 34శాతం ఎక్కువగా చెప్పొచ్చు. ఆకట్టుకోలేని కార్పొరేట్‌ పనితీరు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేకపోవడం, డొమెస్టిక్‌ కన్సంప్షన్‌ తక్కువ కావడం, మాన్సూన్‌ ప్రభావానికి తోడు చమురు ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ ఈ ఏడాది ఎస్‌అండ్‌పి నిఫ్టి 50 పాయింట్లు పెరిగింది. ఈ ఏడాది 8.21శాతం పెరిగింది. ఆర్థిక వ్యవస్థ స్ట్రగుల్‌లో ఉంది. అంతర్జాతీయ ఆయిల్‌ మార్కెట్లు ఇప్పుడు జియో పొలిటికల్‌ ఇబ్బందుల్లో ఉన్నాయని, అంటే అంతర్జాతీయ చమురు మార్కెట్‌ అస్థిరత ఎక్కువగా ఉంటుందని, ముడి చమురు ధరలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు. చమురు షార్టేజ్‌ ఆందోళనలు ఉన్నాయని చెబుతున్నారు. లిబియా చమురు ఉత్పత్తిలో సుమారు 1.1మిలియన్‌ బిఎంల స్వల్ప అంతరాయం కూడా క్రూడాయిల్‌ ధరలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/