ఆరోగ్యశ్రీ పై పిల్‌ను విచారించేది లేదు

ఆరోగ్యశ్రీ అమోఘం

High Court
High Court

హైదరాబాద్ : పైసా ఖర్చు లేకుండా ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం అందుతోంది. బెంగళూరులోని వైద్య సేవలే బాగుంటాయి. అయితే హైదరాబాద్‌లో మరో అడుగు ముందుకేసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకంపై పిల్‌ను విచారించేది లేదు.. అని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కారణాల వల్లే పిల్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల డివిజన్ బెంచ్ పేర్కొంది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని, పైగా ఆరోగ్యశ్రీ సేవలు కార్పొరేట్ ఆస్పత్రుల ద్వారా కాకుండా పూర్తిగా సర్కార్ దవాఖానాల్లోనే అందించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ ఎల్.బి.నగర్ ఏరియాకు చెందిన పి. శేఖర్ రావ్ వేసిన పిల్‌ను గురువారం హైకోర్టు విచారణకు వచ్చింది. ఆస్పత్రుల యాజమాన్యాలతో జరిగిన చర్చల ఫలితంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు తిరిగి మొదలయ్యాయని అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ చెప్పారు. దీంతో పిల్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ వెల్లడిస్తూ పైవిధంగా వ్యాఖ్యలు చేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/