హైకోర్టులో నేడు ఆర్టీసి సమ్మెపై విచారణ

high court of telangana
high court of telangana

హైదరాబాద్‌: ఆర్టీసి సమ్మెపై పూర్తి స్థాయి విచారణ ఈ రోజు మధ్యాహ్నం జరగనుంది. నిన్న కూడా ఆర్టీసి సమ్మెపై విచారణ జరిగింది. ఆర్టీసి సమ్మెకు అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం(ఎస్మా) వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎస్మా పరిధిలోకి తేవాలంటే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని వివరించింది. ఆర్టీసి సమ్మె చట్ట వ్యతిరేకమని తీర్మానించలేమని, అటువంటి అధికారాలు ఈ కోర్టు పరిధిలో లేవని హైకోర్టు పేర్కొంది. పారిశ్రామిక వివాదాల చట్టం పరిధిలోకి ఈ సమ్మె వస్తుందని తేల్చి చెప్పిన ధర్మాసనం.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/