కర్ఫ్యూ విధించాక కేసులు ఎక్కడ తగ్గాయో చూపించాలి

తెలంగాణ సర్కారుకు హైకోర్టు స్ట్రాంగ్ కౌంటర్

TS High Court
TS High Court

Hyderabad: తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ విచారణ జరిగింది. హెల్త్ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు. కరోనా కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నామని, కర్ఫ్యూ కారణంగా రాష్ట్రంలో కేసులు భారీగా తగ్గాయని కోర్టుకు ఆయన తెలిపారు. దీంతో ప్రభుత్వం సమర్పించిన నివేదికపై కోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది.

కర్ఫ్యూ విధించాక రాష్ట్రంలో కేసులు ఎక్కడ తగ్గాయో చూపించాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బార్లు, థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారని, కుంభమేళా వెళ్లినవారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్‌లో పెడుతున్నారని, మరి వారిపట్ల తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని పేర్కొంది. ఆర్ టి పి సి ఆర్ టెస్టు రిపోర్టు ఎందుకు 24 గంటల్లోపు ఇవ్వడం లేదని,. వీఐపీలకు 24 గంటల్లోపే ఎందుకు ఇస్తోంది ప్రభుత్వం.. అని వర్షం కురిపించింది. తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

తాజా ‘మొగ్గ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/