సిఆర్ డిఎ ర‌ద్దు, 3 రాజధానుల బిల్లుల‌పై హైకోర్టు స్టేట‌స్ కో

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్

High Court Status Co on CRDA repeal , 3 Capital Bills

Amaravati: సిఆర్ డిఎ ర‌ద్దు బిల్లు, మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ఈ నెల 14 వరకూ ఈ రెండు బిల్లుల‌పై హైకోర్టు స్టే విధించింది.

రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు.

పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు.

దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాదిని న్యాయ‌మూర్తులు కోరారు..

దీంతో త‌మ‌కు 10 రోజులు స‌మ‌యం కావాల‌ని న్యాయ‌వాది అభ్య‌ర్ధించారు..

అయితే ప‌ది రోజులు స‌మ‌యం ఇస్తే రాజ‌ధానిని త‌ర‌లించే అవ‌కాశాలు‌న్నాయ‌ని పిటిష‌న్ త‌రుపుల న్యాయ‌వాదులు అభ్యంత‌రం చెప్పారు..

ఇరు వాద‌న‌లు విన్న త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఈ నెల 14వ తేది వ‌ర‌కూ ప్ర‌భుత్వ గెజిట్ పై స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది..

త‌దుప‌రి విచార‌ణ‌ను 14వ తేదికి వాయిదా వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/