మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కి హైకోర్టు బిగ్ షాక్ ..

సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేస్తూ రాజీనామా చేసి అధికార పార్టీలో చేరిన వెంకట్రామిరెడ్డికి హైకోర్టు భారీ షాకిచ్చింది. ఆయన కోర్టుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ధిక్కారణ నోటిసు జారీ చేసింది. కాగా ఆయన సిద్దిపేట కలెక్టర్‌ ఉన్న సమయంలో కోర్టు వరి విత్తనాలు , వెయవద్దని చెప్పడంతోపాటు దుకాణాదారులు కూడా ఎవరు అమ్మకూడదని హెచ్చరించారు. దీంతో పాటు దీనిపై హైకోర్టు నుండి ఆదేశాలు తెచ్చిన తాను లెక్క చేయనని చెప్పరంటూ ఆరోపణలు వచ్చాయి.

అదే విషయమై ఆయనపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. విత్తనాలు విక్రయించొద్దని చెప్పడమేంటని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. కోర్టు ఆర్డర్ పట్టించుకోనంటున్నారని.. కలెక్టర్ ఏమైనా సుప్రీం కోర్టు కంటే సుప్రీమా అంటూ ఘాటు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కలెక్టర్‌గా ఉన్న సమయంలో వెంకట్రామిరెడ్డి కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు రావడంతో న్యాయస్థానం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దీనిపై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కేసును వాదించిన ఏజీ ఆయన చేత క్షమాపణ చెప్పిస్తానని కోర్టుకు తెలిపారు. దీంతో కేసును మరో నాలుగు వారాలకు వాయిదా వేశారు.