దిశ నిందితులకు రీపోస్టుమార్టం

Telangana High Court
Telangana High Court

హైదరాబాద్‌: దిశ నిందితుల మృతదేహలకు మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మృతదేహల అంశంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్పిపాల్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం మొత్తం వీడియో తీయాలని ఆదేశించింది. ఈ పోస్టుమార్టం ఎల్లుండి సాయంత్రంలోగా పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. రీపోస్టుమార్టం తర్వాత పోలీసుల సమక్షంలో..మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని తెలిపింది. కలెక్షన్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ను సీల్డ్‌ కవర్‌లో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు దిశ నిందితుల మృతదేహలు ఇప్పటికే 50శాతం కుళ్లీపోయాయి. దిశపై అత్యాచారం అనంతరం హత్య చేసిన నలుగురు నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ మృతదేహాల భద్రత విషయంలో కోర్టు విచారణకు హాజరయ్యారు గాంధీ ఆస్పత్రి సూపరెండెంట్‌ శ్రావణ్‌ ఈ సందర్భంగా నలుగురి మృతదేహాలు 50శాతం డీకంపోజ్‌ అయ్యాయని కోర్టుకు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/