హైకోర్టులో ఏపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

పంచాయతీ కార్యాలయలకు రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను రద్దు చేసిన హైకోర్టు

ap high court
ap high court

అమరావతి: ఏపి సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ కార్యాలయలకు రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. సుప్రీం, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జీవో ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కాగా ప్రభుత్వం మరో రంగును అదనంగా వేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని సోమయాజులు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు 623జీవోను కొట్టివేసింది. సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పంచాయతీ కార్యాలయలకు రంగుల వేయడం కోసం మరో జీవో ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర పంచయతీ రాజ్ సెక్రెటరీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా కోర్టు ధిక్కరణ ప్రక్రియను కూడా ప్రారంభించాలని రిజిస్ట్రార్‌‌ను కోర్టు ఆదేశించింది. ఈనెల 28లోపు రంగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని హైకోర్టు పేర్కొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/