ఆ రెండు సినిమాల విడుదలలో జోక్యం చేసుకోలేం

Lakshmi's NTR move
Lakshmi’s NTR movie

హైదరాబాద్‌: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ , ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమాల విడుదల నిలిపివేయాలని సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో భోజన విరామ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈరోజు హైకోర్టు ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు సినిమాల విడుదలలో జోక్యం చేసుకోలేమని చెప్పింది.ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఖలక్ష్మీస్‌ ఎన్టీఆర్‌గ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రను పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడు పోషించారు. లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటించారు.


మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/