అమ‌రావ‌తి రైతుల బ‌హిరంగ‌స‌భ‌కి హైకోర్టు అనుమతి

రేపు తిరుపతిలో సభను నిర్వహించనున్న రైతులు

తిరుపతి: తిరుప‌తిలో అమ‌రావ‌తి రైతులు స‌భ‌ను నిర్వ‌హించ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తించ‌లేదు. దాంతో రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. రైతులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. రైతుల తరపున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ వాదనలు వినిపించగా… ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం త‌రుపు న్యాయవాది త‌న వాద‌న‌లు వినిపిస్తూ . తిరుప‌తిలో సభ జరిగితే.. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని వివ‌రించారు.సుధాకర్ రెడ్డి . గ‌తంలో అమరావతి రైతుల పాదయాత్రలో పోలీసులపై దాడి చేసారంటూ వీడియోలు చూపించిన ప్రభుత్వ ఏజీ పొన్నవోలు సుధాకర్. అలాగే.. ఓమిక్రాన్ విజృంభిస్తున్న వేళ బ‌హిరంగ స‌మావేశాల‌కు ఎలాంటి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు.

బహిరంగ సభ జరిగే ప్రదేశం తిరుపతి నుంచీ 6 కిలోమీటర్లు, ఎయిర్ పోర్టు నుంచీ 13 కిలోమీటర్లు అని తెలిపిన రైతుల తరఫు న్యాయవాది. రాజ్యాంగం హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై వాదనలు జరిగాయి. కాగా రైతుల తరుపున వాదనలతో ఏకీభవించిన కోర్టు సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు రైతుల అభిప్రాయ‌ల‌ను గౌర‌విస్తూ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు బహిరంగ సభకు అనుమతినిచ్చింది. ఎలాంటి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ‌కుండా సభ నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వంపై, ప్రభుత్వ అధికారులపై ఎలాంటి కామెంట్లు చేయరాని షరతు విధించింది. ఈ మేర‌కు ఈ నెల 17న రైతులు తిరుపతిలో సభను నిర్వహించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/