రాష్ట్రంలో బాణసంచా అమ్మకాలు, కాల్చడం నిషేధం..హైకోర్టు

high court of telangana
high court of telangana

హైదరాబాద్‌: దీపావళి పండుగ నేపథ్యంలో తెలంగాణలో బాణాసంచాను నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. దీపావళి సందర్భంగా బాణాసంచాను నిషేధించాలని న్యాయవాది ఇంద్ర ప్రకాశ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. కరోనా పరిస్థితుల్లో కాలుష్యం పెరిగి తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషన్‌ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు, పలు హైకోర్టులు రాష్ట్రాలు నిషేధం విధించాయని కోర్టుకు తెలిపారు. అయితే బాణాసంచాపై నిర్ధిష్ట పాలసీ రూపొందించలేదని, ఎన్టీసీ మార్గదర్శకాలు పాటిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బాణాసంచాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఇప్పటి వరకు తెరిచిన బాణాసంచా షాపులను మూసివేయాలని ఆదేశించింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 19న తెలపాలని హైకోర్టు తెలిపింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/