నా బెస్ట్‌ పార్ట్‌నర్‌ అతడే..

అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన పృథ్వీ షా

pritvi shaw
pritvi shaw

ముంబయి: కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమయిన క్రికెటర్లు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గోంటున్నారు. తాజాగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు భారత యువ క్రికెటర్‌ పృథ్వి షా సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్బంగా ఓ అభిమాని మీ ఫేవరెట్‌ ఓపెనింగ్‌ భాగస్వామి ఎవరని ప్రశ్నించాడు. ఈప్రశ్నకు సమాధానంగా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే శిఖర్‌ ధావన్‌ అని చెప్పాడు. ఎక్కువ సార్లు అతనితో కలిసి ఓపెనింగ్‌ చేశనని, అంద-కే తన ఫేవరెట్‌ పార్ట్‌నర్‌ ధావన్‌ అని ఈ యువ క్రికెటర్‌ చెపుకొచ్చాడు. ఈ తరుణంలోనే తర ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ అని , సచిన్‌ లా ఆడడం అంటే తనకు ఇష్టమని , అలా ఆడడానికి ప్రయత్నిస్తానని కూడా చెప్పాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/