జాఖ‌వ్ పోర్టులో రూ. 360 కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టివేత

heroin-seized-at-jakhau-port-in-gujarat

అహ్మదబాద్‌ః గుజ‌రాత్‌లోని అరేబియా స‌ముద్ర తీర ప్రాంతంలోని జాఖ‌వ్ పోర్టులో భారీగా హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. తీర ప్రాంత గ‌స్తీ ద‌ళాలు, గుజ‌రాత్ యాంటీ టెర్ర‌రిజం స్క్వాడ్ క‌లిసి చేప‌ట్టిన త‌నిఖీల్లో 50 కిలోల హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. దీని విలువ రూ. 360 కోట్లు ఉంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఉద‌యం పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన ఓ బోటులో హెరాయిన్ ప‌ట్టుబ‌డింద‌ని తెలిపారు. బోటులో ఉన్న ఆరుగురు వ్య‌క్తుల‌ను కూడా అదుపులోకి తీసుకున్న‌ట్లు చెప్పారు. హెరాయిన్‌ను త‌ర‌లించిన బోటును ఏ1 స‌క‌ర్ బోటుగా గుర్తించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/