మహేష్ చిత్రంలో నటించడంపై తరుణ్ క్లారిటీ

బాల నటుడి గా యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న తరుణ్..హీరోగా కూడా సూపర్ హిట్లు చేసి మెప్పించారు. కాకపోతే హీరోగా ఎక్కువ కాలం సాగించలేకపోయారు. బిజినెస్ రూట్లోకి వెళ్లి సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. తాజాగా ఈయన మహేష్ 28 చిత్రంలో నటించబోతున్నట్లు గత కొద్దీ రోజులుగా మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు చూసి చాలామంది నిజమే కావొచ్చని అల్ ది బెస్ట్ చెప్పడం స్టార్ట్ చేసారు. ఈ వార్తల ఫై తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తనను ఈ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని, ఈ వార్త నిజం కాదని ఆయన పేర్కొన్నారు. తనకు సంబంధించిన ఎలాంటి వార్త ఉన్నా తన అభిమానులతో పంచుకుంటానని అన్నారు.

ఇక మహేష్ – త్రివిక్రమ్ కలయికలో మహేష్ 28 చిత్రం తెరకెక్కబోతుంది. ఇప్పటీకే సెట్స్ పైకి రావాల్సి ఉండగా పలు కారణాలతో ఆలస్యమవుతూ వస్తుంది.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ – మహేష్ కలయికలో ఇది మూడో చిత్రం కావడం విశేషం. గతంలో వీరిద్దరి కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు వచ్చి ప్రేక్షకులను , అభిమానవులను ఆకట్టుకున్నాయి. దీంతో మూడోసారి వీరి నుండి సినిమా రావడం తో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.