హీరో బీఎస్-6 సూపర్ స్ల్పెండర్

న్యూఢిల్లీ: టూవీలర్ల మార్కెట్ దిగ్గజం హీరో మోటోకార్ప్ గురువారంనాడు సూపర్ స్ప్లెండర్ బీఎస్ 6 వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.67,300 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్). 125 సీసీ ఇంజన్ కలిగిన ఈ బైక్ రెండు వేరియంట్ల (సెల్ఫ్ స్టార్ట్, డ్రమ్ బ్రేక్ విత్ అలాయ్ వీల్స్)లో లభిస్తుంది. కాగా, అన్ని బీఎస్4 వాహనాల ఉత్పత్తిని నిలిపివేసినట్లు కం పెనీ తెలిపింది. ఇప్పటికే బీఎస్6 ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, ప్యాషన్ ప్రో, గ్లామర్ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/