ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ కు క్షమాపణలు తెలిపిన హీరో రామ్

హీరో రామ్ ప్రస్తుతం ది వారియర్ మూవీ తో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచేస్తుండగా..నిన్న సినిమాలోని విజిల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సందర్బంగా ఏర్పటు చేసిన కార్య క్రమంలో హీరో రామ్ అందరి గురించి తెలిపి..డైరెక్టర్ గురించి చెప్పడం మరచిపోయాడు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ లింగుస్వామి కి క్షమాపణలు తెలిపాడు.

“ఈ చిత్రం తెరకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్‌, డైరెక్టర్‌ లింగుస్వామి!! ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ని మీరు మీ భుజాలపైకి ఎత్తుకున్నారు. ఇప్పటివరకూ నేను పనిచేసిన ఉత్తమమైన దర్శకుల్లో మీరూ ఒక్కరిగా ఉన్నందుకు ధన్యవాదాలు. సారీ అండ్‌ లవ్‌ యూ” అని రామ్‌ రాసుకొచ్చారు.రామ్‌ పెట్టిన ట్వీట్‌పై లింగుస్వామి స్పందించారు. “నాతో కలిసి పనిచేయడాన్ని నువ్వు ఎంతలా ఇష్టపడ్డావో నాకు తెలుసు. అలాగే, సినిమా చూసిన అనంతరం ఆత్మీయంగా నువ్వు నన్ను ఆలింగనం చేసుకున్నావ్‌ కదా.. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మనం మరింత దూరం ప్రయాణించాలని కోరుకుంటున్ని” అని రిప్లయ్ ఇచ్చారు.

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రామ్ కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా , దేవి శ్రీ మ్యూజిక్ అందించారు.