సిద్దిపేటలో హరీష్ రావు తో కలిసి సందడి చేసిన హీరో నాని

నేచురల్ స్టార్ నాని..గురువారం సిద్దిపేట లో సందడి చేసారు. రేపు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ సీజన్‌-3ని జిల్లా కేంద్రంలోని జయశంకర్‌ స్టేడియంలో సినీ నటుడు నాని, క్రికెటర్‌ అంబటి రాయుడుతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

ఈ సందర్బంగా హీరో నాని మాట్లాడుతూ.. సక్సెస్ సెలబ్రేషన్‌కు వచ్చిన ఆనందం కలుగుతుందని , 378 టీమ్‌లు ఆడటం గ్రేట్‌ అని, ఇంత పెద్ద ఈవెంట్ బహుశ దేశంలోనే జరుగలేదన్నారు. సిద్దిపేట అభివృద్ధి అద్భుతమని, మంత్రి హరీష్ రావు సిద్దిపేట ప్రజలకు కుటుంబంలో పెద్ద దిక్కు అన్నారు. సిద్దిపేట అంటే చిన్న టౌన్ అనుకున్నా.. కానీ గచ్చిబౌలిలో తిరుగుతున్నట్లు ఉందన్నారు.

హరీశ్‌రావు మాట్లాడుతూ.. 140 కోట్ల జనాభాలో ఇండియా టీమ్‌లో ఉండేది.. 11 మందే అందులో ఒక్కరు అంబటి రాయుడు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎకరంన్నర భూమిని రాయుడు ఇచ్చాడని, కాళేశ్వరం నీళ్లతో అంబటి రాయుడు బంగారంలాంటి పంట పండిస్తున్నారని హరీశ్‌రావు ప్రశంసించారు. నిత్యజీవితంలో కనబడే పాత్రల నటుడు నాని అని, జెర్సీ సినిమాలో అతను పోషించిన పాత్ర యువతకు ఆదర్శమన్నారు. పట్టుదలతో యువత ముందుకు సాగాలని, నిజజీవితంలో ఆటలు, చదువులు, సామాజిక సేవలో ఆల్‌ రౌండర్లుగా ఎదగాలని పిలుపునిచ్చారు.