మ‌హేష్‌ బాబు నుంచి నేర్చుకున్న‌వి అవే – అశోక్ గ‌ల్లా

మురారి లాంటి సినిమా చేయాల‌నుంది 

Hero Ashok Galla interview photo

మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడే అశోక్ గ‌ల్లా. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కూడా అయిన జ‌య‌దేవ్ ఇంటి నుంచి అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ నుంచి వ‌చ్చిన సినిమా హీరో. అశోక్ గ‌ల్లా క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌ యం అయ్యారు. కౌబాయ్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాతో అశోక్ గ‌ల్లాకు న‌టుడిగా మంచి గుర్తింపు వ‌చ్చింది. ఈ సినిమా థియేట‌ర్‌ లోనూ ఓటీటీలోనూ విడుద‌లై న‌టుడిగా త‌న‌కెంతో సంతృప్తినిచ్చింద‌ని అశోక్ గ‌ల్లా తెలియిజేస్తున్నారు. ఓటీటీలో వ‌స్తున్న అభినంద‌న‌లు కొత్త ఉత్సాహానిచ్చాయ‌ని తెలియ‌జేస్తూ, తాను చేయ‌బోయే కొత్త సినిమా జూన్‌ లో వెల్ల‌డిస్తాన‌ని పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అశోక్ గ‌ల్లా తో జ‌రిపిన ఇంట‌ర్వ్యూ విశేషాలు.

కొత్త గెట‌ప్‌ లో క‌నిపిస్తున్నారు. ఏదైనా కొత్త సినిమా కోస‌మా?

హీరో స‌క్సెస్ త‌ర్వాత తిరుప‌తి వెళ్ళాను. అందుకే ఈ గెట‌ప్ క‌నిపిస్తుంది.

హీరో సినిమా స‌క్సెస్‌ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

హీరో స‌క్సెస్‌ ను వృత్తిప‌రంగా సంతృప్తి చెందాను. సినిమాలో హీరోగా నిల‌బ‌డాల‌ని అనుకున్న‌ప్పుడు వ‌చ్చిన స‌క్సెస్ ఇది. ఇప్పుడు త‌ర్వాత ఏమి చేయాల‌నేది ఆలోచిస్తున్నాను.

హీరో క‌థ‌ను ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ చెప్పిన‌ప్పుడు ఎలా అనిపించింది?

నేను మంచి క‌థ‌తో రావాల‌నుకున్నాను. ఆ స‌మ‌యంలో అనుకోకుండా శ్రీ‌రామ్ వ‌చ్చి భోజ‌నం టైంలో క‌థ చెప్పారు. అది విన్న‌వెంట‌నే ఇదే క‌దా మ‌నం చేయాల్సింది అనిపించింది. వెంట‌నే ఓకే చెప్పేశాను. ఆ త‌ర్వాత ఆయ‌న ఆఫీస్‌కూడా తీయ‌డం ప‌నులు జ‌ర‌గ‌డం చ‌కచ‌కా జ‌రిగిపోయాయి.

మ‌ళ్ళీ ఆయ‌న‌తో సినిమా చేసే అవ‌కాశం వుందా?

ప్ర‌స్తుతం వేరే సినిమా చేయాల‌నుకుంటున్నాను. అవ‌కాశం వుంటే త‌ప్ప‌కుండా చేస్తాను.

హీరో సినిమా చూశాక ఇంకా ఏమైనా కొత్త‌గా చేస్తే బాగుంటుంద‌నిపించిందా?

ఇది న్యూ ఏజ్ స్టోరీ. ఈ క‌థ‌ను కామెడీగా చూపించాం. సీరియ‌స్‌గానూ కామెడీ లేకుండా చేయ‌వ‌చ్చు. ప్రోగ్రెసివ్ స్టోరీ క‌నుక తెలుగు ఫార్మాట్ లో చేయ‌డం వ‌ల్ల కొత్త కిక్ ఇచ్చేలా చేశాం.

త‌దుప‌రి మీ బేన‌ర్‌ లోనే సినిమా వుంటుందా?

బ‌య‌ట బేన‌ర్‌ లో వుండ‌బోతోంది. త్వ‌ర‌లో వివ‌రాలు తెలియ‌జేస్తాను.

‘హీరో’ సినిమా చూశాక మ‌హేష్‌బాబు రెస్పాన్స్ ఎలా వుంది?

మ‌హేష్‌బాబు సినిమా చూశాక‌,  ఐ యామ్ ప్రౌడ్ఆఫ్ యు.. అన్నారు. కేవ‌లం ఈ సినిమా గురించే చెప్పారు.  అదేవిధంగా కంటిన్యుటీ లో చిన్న‌పాటి త‌ప్పిదాలు వుంటే చెప్పేరు.

న‌ట‌న‌ప‌రంగా ఎటువంటి ప్ర‌శంస‌లు ద‌క్కాయి?

పెర్ ఫార్మెన్స్ ప‌రంగా మెచ్చుకుంటుంటే నాపై నాకే న‌మ్మ‌కం వ‌చ్చేసింది. మోటివేషన్ ఎక్కువ‌యింది. మ‌నం చేసింది బాగానే వుంది అంటున్నారు కాబ‌ట్టి ఇంకా ఎక్కువ చేయాల‌నే ఎన‌ర్జీతోపాటు ఎంకరేజింగ్ గా అనిపించింది.

హీరోగా కెరీర్ ఎలా వుండ‌బోతోంది అనుకుంటున్నారు?

న‌టుడిగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల‌నుంది. హీరో సినిమా న‌టుడిగా ప్రూవ్ అయ్యాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. త‌ర్వాత క‌థ‌లు, పాత్ర‌లు అనేవి కొత్త‌గా వుండేలా చూసుకోవాలి.

కొత్త సినిమా వివ‌రాలు?

రెండు, మూడు సినిమాలు రెడీగా వున్నాయి. ఏద‌నేది ఫైన‌ల్ అయ్యాక జూన్‌ లో తెలియ‌జేస్తాను.

మీకు న‌టుడిగా స్పూర్తి ఎవ‌రు?

ఇంకెవ‌రు.. మ‌హేష్‌బాబు గారే. నేను పెరిగింది ఆయ‌న సినిమాలు చూసే. న‌ట‌న వాతావ‌ర‌ణం అంతా నా చుట్టూనే వుంది.

ఆయ‌న్నుంచి ఏం నేర్చుకున్నారు?

సెల్ప్ బిలీఫ్ అనేది మ‌హేష్‌గారికి బాగా తెలుసు. కాన్‌ఫిడెన్స్ అనేది మ‌నలోనే వుంటుంది. ఇవి ఆయ‌న్నుంచి నేర్చుకున్నా.

కృష్ణ‌ గారు మీ హీరో సినిమాను ఎన్నిసార్లు చూశారు?

ఆయ‌న ఒక‌సారే చూశారు. కౌబాయ్ సినిమా కాబ‌ట్టి బాగా ఎంజాయ్ చేశారు. సినిమా చూశాక పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పేశారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/